మీ ఆదాయ పన్ను భారాన్ని తగ్గించే సెక్షన్ 80సీ పెట్టుబడులు..

-

ఆదాయ పన్ను కట్టడం అనేది ఖచ్చితం. ప్రతీ ఏడాది మార్చి 31వ తేదీలోగా ఆ సంవత్సరానికి గాను ఎంత సంపాదించావనే విషయమనే ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఏడాది సంపాదించిన మొత్తానికి దాని మీద స్లాబుల ప్రకారం పన్ను వేస్తారు. మీ ఆదాయం 5లక్షలయితే ఒకలా, పది లక్షలయితే ఒకలా పన్ను విధించబడుతుంది. ఐతే మన ఆదాయం ఎంత ఉన్నా కొంత మేర ఆదాయానికి పన్ను కట్టాల్సిన అవసరం నుండి తప్పించుకునే అవకాశం ఉంది.

అదే సెక్షన్ 80సీ. దీని ప్రకారం ఆదాయంలో లక్షా యాభైవేల మొత్తానికి ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఐతే ఇది ఎలా వర్తిస్తుందనేది చాలా మందికి తెలియని విషయం. ఆదాయ పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు 1,50,000 వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అది కూడా ప్రభుత్వం సూచించిన వాటిల్లోనే. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఆదాయం పది లక్షలు ఉందనుకుందాం. సెక్షన్ 80సీ కింద పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్న వాటిల్లో పెడితే 8,50,000 రూపాయలకే ఆదాయ పన్ను వర్తిస్తుంది.

ఐతే సెక్షన్ 80సీ కింద ఎక్కడెక్కడ పొదుపు చేయవచ్చంటే,

మ్యూఛువల్ ఫండ్స్ లోని ఈఎల్ ఎస్ ఎస్ స్కీమ్స్..

ఈపీఎఫ్, పీపీఎఫ్
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
వయోవృద్ధ పొదుపు పథకం
సుకన్య సమృద్ధి యోజన
బ్యాంకు ఫిక్స్ డిపాజిట్
నేషనల్ పెన్షన్ స్కీమ్
లైఫ్ ఇన్స్యూరెన్స్
పిల్లల స్కూల్ ఫీజు
హోమ్ లోన్స్

పైన చెప్పిన పథకాలు సెక్షన్ 80సీ కింద పొదుపు చేయడానికి పనికొస్తాయి. ఐతే ఈ పథకాలన్నీ లాకిన్ లో ఉంటాయి. పొదుపు చేసిన మొత్తాన్ని కొన్ని రోజుల పాటు ఉపసంహరించుకునే వీలు లేకుండా ఉంటుంది. ఈ సెక్షన్ గురించి తెలుసుకునే వాళ్ళు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version