ట్రావెల్: తెరుచుకున్న మాల్దీవ్స్.. కరోనా నియమ నిబంధనలివే..

-

అంతర్జాతీయ పర్యాటకంలో అందరూ ఇష్టపడే ప్రాంతాల్లో మాల్దీవ్స్ కూడా ఒకటి. ఇండియా నుండి మాల్దీవులకి వెళ్ళే సెలెబ్రిటీల గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కడి బీచుల్లో బికినీ ఫోటోషూట్లతో సోషల్ మీడియాని మంటలు రేపినవాళ్ళు చాలామంది ఉన్నారు. మాల్దీవ్స్ ప్రభుత్వం కూడా ఇండియన్ సెలెబ్రిటీలకు ప్రత్యక ఆఫర్లు ఇస్తూ ఉంటుంది. ఐతే కరోనా సెకండ్ వేవ్ వల్ల దక్షిణ ఆసియా దేశాల నుండి వచ్చేవారిపై నిషేధం విధించింది. మే 23వ తేదీన విధించిన ఈ నిషేధం ఇప్పటి వరకు కొనసాగింది.

ప్రస్తుతం జులై 15వ తేదీ నుండి ఈ నియమ నిబంధనలు సడలిస్తున్నారు. మాల్దీవుల సందర్శనకు అనుమతులు ఇస్తున్నారు. కాకపోతే హోటల్లో బస చేయడానికి మాత్రం జులై 30వ తేదీ నుండి అనుమతులు ఇవ్వనున్నారు.

సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న మాల్దీవుల్లో కరోనా నియమ నిబంధనలు చాలా ఉన్నాయి. పర్యాటకానికి వచ్చే వారు ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఆ నియమ నిబంధనలు ఇప్పుడే తెలుసుకుందాం.

నిబంధనలు

ఈ దీవుల ప్రాంతాన్ని సందర్శించాలనుకునే విదేశీ పర్యాటకులు, విమానాశ్రయంలోనే హోటల్ రిజర్వేషన్ చూపించాల్సి ఉంటుంది.

ప్రతీ ఒక్కరు, కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు సైతం ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా 48గంటల లోపుదై ఉండాలి.

దీంతో పాటు మాల్దీవ్స్ ఇమ్మిగ్రేషన్ వారు అందించే హెల్త్ డిక్లరేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి.

పర్యాటకులు క్వారంటైన్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ గ్రూపులో ఎవరో ఒకరికి కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.

మాల్దీవ్స్ వెళ్ళాలనుకున్న వారు అక్కడకు చేరుకున్న తర్వాత మాల్దీవ్స్ ట్రేసింగ్ యాప్, ట్రాక్ ఎకీ ఆనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version