వన్ నైట్ స్టాండ్ ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ నష్టాలు తెలుసుకోవాల్సిందే..!

-

ఈ మధ్య చాలా సాధారణం అయిన వన్ నైట్ స్టాండ్ లో అనేక నష్టాలు ఉన్నాయి. అవేంటనేది తెలుసుకునే ముందు అసలు వన్ నైట్ స్టాండ్ అంటే ఏమిటో తెలియని వాళ్ళకోసం  ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 

అప్పటి వరకు తెలియని వ్యక్తితో శరీర సంబంధం పెట్టుకోవడమే వన్ నైట్ స్టాండ్. అది కూడా కేవలఎం ఒక్క రాత్రికి మాత్రమే. ఈ పద్దతి మెట్రో నగరాల్లో విపరీతంగా పుంజుకుంటుంది. ఐతే వన్ నైట్ స్టాండ్ పట్ల ఆసక్తి గల వాళ్ళు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం.

వన్ నైట్ స్టాండ్ అనేది కేవలం సెక్స్ కోసం మాత్రమే. అక్కడ ప్రేమ అన్న కాన్సెప్టే ఉండదు. కామం ఒక్కటే కంనిపిస్తుంది. అలాంటప్పుడు కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంది.

భావోద్వేగాలు

వన్ నైట్ స్టాండులో భావోద్వేగాలకు చోటు లేదు. కాబట్టి మీరు ఎమోషనల్ పర్సన్ అయితే ఇలాంటివి పెట్టుకోకపోవడమే మంచిది. లేదంటే వారి జ్ఞాపకాలు వెంటాడి మిమ్మల్ని వేధిస్తుంటాయి. అది మీ కుటుంబ బంధాలపై ప్రభావం చూపవచ్చు.

వికృతం

వన్ నైట్ స్టాండ్ లో ఇతరుల ఇష్టాలు, అయిష్టాలు ఏవీ తెలియవు. కాబట్టి మనసులోకి ఏది వచ్చిందో అలానే నడుచుకుంటారు. అలాంటప్పుడు అవతలి వారికి ఇష్టం లేని పనులు చేస్తారు. అది వారిపై ప్రభావం చూపుతుంది. దానివల్ల అవతలి వారు మీ నుండి దూరంగా పారిపోయే అవకాశం ఉంది.

చిన్న ప్రపంచం

ప్రపంచం చాలా చిన్నది. కాబట్టి వన్ నైట్ స్టాండులో మీకు కనిపించిన వారు మళ్ళీ ఎక్కడైనా కనిపించి, మీ కుటుంబంలో చిచ్చులు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ విషయం అంతా అయ్యాక గానీ అర్థం కాదు.

అసురక్షితం

చాలామంది చేసే తప్పు ఇదే. అప్పటి ఆనందం కోసం అసురక్షిత శృంగారంలో పాల్గొని లేని పోని సుఖవ్యాధులను వెంట తెచ్చుకుంటారు. గుర్తు తెలియని వారి గురించి గుడ్డిగా నమ్మడం గుంతలో పడిపోయినట్టే అవుతుందని గుర్తుంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version