పవన్‌ కల్యాణ్‌ రాజకీయ అజ్ఞాని : కొడాలి నాని

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాని అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు కొడాలి నాని. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజావాణి పెట్టాల్సిన పవన్ కల్యాణ్.. చంద్రబాబు నాయుడు చిల్లరకు ఆశపడుతున్నాడని ఆరోపించారు కొడాలి నాని. కొందరు అమరావతి రైతులు, టీడీపీ ,జనసేన, తోక పార్టీలు చేస్తున్న పాదయాత్రకు విరుగుడే విశాఖలో జేఏసీ సభ అని కొడాలి నాని అన్నారు. విశాఖ గర్జన బల ప్రదర్శన కాదని.. మూడు జిల్లాల ప్రజల ఆకాంక్ష అని చెప్పారు కొడాలి నాని.

Kodali Nani Turns A Big Headache For Andhra CM Jagan

ఇదిలా ఉంటే.. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్ 2‌కు చంద్రబాబు గెస్ట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఏపిసోడ్ అక్టోబర్ 14న ఆహా ఓటీటీలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ ఏపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ షోలో చంద్రబాబు వ్యక్తిగత విషయాలు, రాజకీయాలకు సంబంధించి పలు అంశాలను వెల్లడించినట్టుగా తెలుస్తోంది. 1995‌లో చోటుచేసుకన్న పరిణామాలపై చంద్రబాబు మాట్లాడినట్టుగా ప్రోమో ద్వారా అర్ధం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news