కన్వెన్షన్ లో క్యాసినో పెట్టానని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటా- కోడాలి నాని

-

ఆంధ్ర ప్రదేశ్ లో గుడివాడ రాజకీయం హీట్ ఎక్కిస్తోంది. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కోడాలి నాని కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో, పేకాట ఆడినట్లు  టీడీపీ ఆరోపించి.. ఈరోజు ఏకంగా ఓ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై మంత్రి కోడాలి నాని తీవ్రస్థాయిలో స్పందించారు. టీడీపీ, చంద్రబాబు నాయుడిని తనదైన శైలిలో విమర్శించారు. కే కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో పెట్టానని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని… నిరూపించలేకపోతే టీడీపీ, చంద్రబాబు నాయుడు ఏం చేస్తారని సవాల్ విసిరారు.

చంద్రబాబు టైం అయిపోయిందని.. ప్రజల్ని వేధించిన వారిని, ప్రజల్లో గెలుపొందలేని వారిని తీసుకువచ్చి నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడికి దమ్ము లేదని… నేనున్నంత కాలం నా పంక్షన్ హాల్ లో కూడా అడుగుపెట్టలేడని.. నా చిటికెన వేలుపై వెంట్రుక కూడా పీకలేరని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రశాంతంగా ఉన్న గుడివాడలో అలజడి రేపేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. అమ్మాయిలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తారని.. లక్ష్మీ పార్వతిని అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని.. భార్యను కూడా నడిరోడ్డు పైకి తీసుకువచ్చిన వాడు చంద్రబాబు అంటూ దూషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version