ష‌ర్మిల‌కు ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తిస్తున్న కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌.. విష‌య‌మేంటి..?

-

వై.ఎస్‌.ష‌ర్మిల మొద‌టి నుంచి తెలంగాణ రాజ‌కీయాల్లో గుర్తింపు కోస‌మే ప్ర‌య‌త్నిస్తోంది. ఎందుకంటే ఆమెపై ఆంధ్రా ముద్ర ఉండ‌టం, అలాగే ఒక్క లీడ‌ర్ కూడా ఆమె పార్టీలో లేక‌పోవ‌డంతో ఆమె విమర్శ‌లు చేసినా క‌నీసం ప‌ట్టించుకునే వారే లేరు. దీంతో ఆమె ఎలాగైనా ఇత‌ర పార్టీల్లోని కీల‌క నాయ‌కుల‌ను త‌న పార్టీలో చేర్చుకుని ఉనికి చాటుకోవాల‌ని తెగ ట్రై చేస్తోంది. అయితే ఆమె పార్టీలో చేరేందుకు మాత్రం ఎవ‌రూ పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూప‌ట్లేదు.కాగా ఇప్పుడు కాంగ్రెస్‌లో అసంతృప్తిలో ఉన్న కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ Komantireddy Brothers మాత్రం ఆమెకు ఇన్ డైరెక్టుగా సపో్ర్టు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొన్న ఆమె పార్టీ ఆవిర్భావ రోజునాడు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్ప‌డ‌మే కాకుండా రాణించాలిన కోరారు. ఇక ఇప్పుడు ఆయ‌న త‌మ్ముడు రాజ‌గోపాల్ రెడ్డి కూడా మ‌ద్ద‌తు తెల‌పడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఇప్పుడు ష‌ర్మిల అన్ని జిల్లాల్లో నిరుద్యోగుల త‌ర‌ఫున దీక్ష‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆమె న‌ల్గొండ‌లో చేస్తున్న దీక్ష‌కు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి స‌పోర్టు చేశారు. ఆమెతో రీసెంట్ గా మాట్లాడిన ఫోన్ కాల్స్ లీక్ కావ‌డం ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారింది. దీంతో నిజంగానే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ష‌ర్మిల‌కు ఇన్ డైరెక్టుగా స‌పోర్టు చేస్తున్నారా అనే అనుమానాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. మ‌రి రేవంత్ మీద అస‌హ‌నంతో ఉన్న వారు ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version