తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అయితే ప్రస్తుత తెలంగాణ రాజకీయం మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలు అన్ని మునుగోడు పై ఫోకస్ పెట్టాయి. అన్ని పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు అక్కడే మకాం వేశారు. తమకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తమ అభ్యర్థి గెలుపు కోసం నిరంతరం కష్ట పడుతున్నారు. ఇదిలా ఉంటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారసుడు సంకీర్త్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక పై సంకీర్త్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.
84 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు, 8 నుంచి 10 మంది ఎంపీలు, అపారమైన సంపద, పోలీసులు బలగాలు కలిసి రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు పనిచేస్తున్నాయని ట్వీట్ చేశారు. తన నాన్నను చూస్తే చాలా గర్వంగా ఉందని చెప్పారు. మునుగోడు ప్రజల కోసం తన తండ్రి మొత్తం అసెంబ్లీనే.. మునుగోడుకు తీసుకొచ్చారని వ్యాఖ్యనించారు. మునుగోడు తీర్పు ఇప్పటికే వెలువడింది అంటూ చెప్పుకొచ్చారు. మునుగోడు ప్రజలు గెలిచారంటూ సంకీర్త్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.