Breaking : రేవంత్‌ రెడ్డికి వార్నింగ్‌ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యవహారం ఆ పార్టీ నేతల్లో ఆగ్రావేశాలను రగిలిస్తున్నాయి. తాజాగా భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తాజాగా మాట్లాడుతూ.. రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారంపై తాను స్పందించేది లేద‌ని స్పష్టం చేశారు. ఈ వ్య‌వ‌హారంలో ఏది ఉన్నా రాజ‌గోపాల్ రెడ్డినే అడ‌గాలంటూ మీడియాకు తెలిపారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. రాజ‌గోపాల్ రెడ్డి త‌న‌కు ఇష్ట‌మున్న పార్టీలోకి వెళ్లిపోయార‌న్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. బుధవారం కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అవ‌కాశాలు ఇవ్వ‌కుంటే… బ్రాందీ షాపుల్లో ప‌నిచేయ‌డానికి కూడా ప‌నికి రారంటూ రాజ‌గోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.

komatireddy venkat reddy: తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా  కోమటిరెడ్డి వెంకటరెడ్డి: ఇమిడియట్ ఎఫెక్ట్ - Telugu Oneindia

త‌మ కుటుంబం బ్రాందీ వ్యాపారం చేస్తోందంటూ వ్యాఖ్య‌లు చేసిన రేవంత్ రెడ్డి త‌మ‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. పార్టీ మారిన స‌మ‌యంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారా? అని కూడా ప్ర‌శ్నించారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. త‌న వ్యాఖ్య‌ల‌తో రేవంత్ రెడ్డి త‌నను అనుమానిస్తున్నారా? అని ప్ర‌శ్నించారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. రేవంత్ రెడ్డి త‌న‌ను అన‌వ‌స‌రంగా రెచ్చ‌గొట్టొద్ద‌ని హెచ్చ‌రించారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news