తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయంగా ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేలినా… స్వార్థం కోసం ఎన్ని రకాల రాజకీయ కుతుక్తులు పన్నినా తనలో కూడా మానవత్వం ఉందని నిరూపించే ఒక మంచి పని చేశాడు. తాజాగా కుషాయిగూడ లో అగ్నిప్రమాదం జరిగి ఒక కుటుంబంలో అందరూ చనిపోయి ఒక అబ్బాయి మాత్రమే బ్రతికిన విషయం తెలిసిందే. ఈ కుటుంబంలో నరేష్, అతని భార్య సుమ మరియు కొడుకు జస్విత్ లు మరణించారు… కానీ నరేష్ పెద్ద కుమారుడు హస్విత్ మాత్రం జీవించి ఉన్నాడు.
అనాధ హస్విత్ ను దత్తత తీసుకుని… ఉదార స్వభావాన్ని చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి !
-