మంగళగిరిలో జరుగుతున్న జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు తేవాలనే ఉద్దేశ్యంతోనే కోనసీమలో కుట్రపన్నారని అన్నారు నాదెండ్ల. వచ్చేనెలలో పులివెందులలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందన్నారు. “ప్రభుత్వమే కోనసీమలో కులాల చిచ్చు పెట్టింది. కోనసీమ ఘటనపై ఇప్పటివరకు సీఎం స్పందించలేదు. కోనసీమ లో శాంతి నెలకొనాలి అనే ఆప్పిల్ కూడా చేయలేదు.
ముందస్తు ఎన్నికలు తేవాలనే వ్యూహంలో భాగంగానే కోనసీమ కుట్ర. కోనసీమలో అలజడి సృష్టించారు. ఇంటర్నెట్ కట్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోలేని పరిస్థితి. కోనసీమలో శాంతి నెలకొనాలి అని ముందుగా స్పందించింది పవన్ కళ్యాణే” అని అన్నారు.జనసేన కార్యకర్తలే కోనసీమ గొడవకు కారణం అంటూ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తోంది. తప్పు చేసిన వారిని శిక్షించండి.. తప్పు చేయని వారిని అరెస్టు చేస్తే సహించం అని అన్నారు నాదెండ్ల మనోహర్.