కొండా సురేఖ vs సమంత.. మహిళా కమిషన్ రియాక్షన్ ఇదే!

-

అక్కినేని నాగార్జున కుటుంబంపై, ఆ ఇంటి మాజీ కోడలు సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. సామ్ చై విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమని మంత్రి ఆరోపించింది. మంత్రి కామెంట్స్‌పై సినీ, పొలిటికల్ వ్యక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో సమంతపై తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. అయినప్పటికీ మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ ఇండస్ట్రీలోని ప్రముఖులు సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు.

తాజాగా ఈ వివాదంపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని నిశితంగా పరిశీలించామని, సామ్‌కు ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పకపోయి ఉంటే..మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించేదని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇక తమ పాత్ర అవసరం లేదని భావిస్తున్నట్లు తెలంగాణ మహిళా కమిషన్ తెలిపింది.తమ కుటుంబంపై వచ్చిన ఆరోపణల విషయంలో నాగార్జున.. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు ఇచ్చే అంశం పూర్తిగా తన వ్యక్తిగతమని కమిషన్ అభిప్రాయపడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version