Koratala Siva: ‘ఆచార్య’లో ఎవరూ ఊహించని సస్పెన్స్..కొరటాల శివ ప్లాన్ ఇదే

-

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆచార్య’. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరో, కాగా, ఇందులో ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ట్రైలర్ లో యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో ఉండటం పట్ల మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘చిరుత’ పులుల మాదిరిగా తండ్రీ తనయుడు చిరంజీవి-రామ్ చరణ్ పోరాట సన్నివేశాలు అత్యద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. అయితే, ట్రైలర్ లో మెయిన్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కనబడకపోవడం అనేది సస్పెన్స్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

వింటేజ్ లుక్ లో మెగాస్టార్ చిరు అదిరిపోగా, ఆయనకు కాజల్ అగర్వాల్ కు మధ్య ఉన్న లవ్ ట్రాక్ అనేది సస్పెన్స్ గా ఉంచాలని కొరటాల శివ డిసైడ్ అయినట్లు టాక్. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్- పూజా హెగ్డేల లవ్ స్టోరిని మాత్రమే ట్రైలర్ లో చూపించారట.

ఈ పిక్చర్ ను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్ పై రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించారు. చిరంజీవి మాస్ ఎలివేషన్ సీన్స్ చూసి వావ్ అంటున్నారు సినీ ప్రేక్షకులు. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. త్వరలో ‘ఆచార్య’ ప్రమోషన్స్ ను డైరెక్టర్ కొరటాల శివ, హీరోలు రామ్ చరణ్, చిరంజీవి స్టార్ట్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version