కోటంరెడ్డి జగన్ కు నమ్మకద్రోహం చేశారు – పేర్ని నాని

-

తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, తనని అనుమానించారని, ఇన్ని అవమానాలు జరిగిన చోట తాను ఉండలేనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు పేర్ని నాని. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 25 వ తేదీనే కోటంరెడ్డి బ్లూ బెంజ్ కారులో నారా లోకేష్ ని కలిశాడని ఆరోపించారు పేర్ని నాని.

అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీలకు టచ్ లో ఉండొచ్చా అని ప్రశ్నించారు. సీఎం జగన్ అందరినీ నమ్ముతారని అన్నారు. నెల్లూరు నారాయణతో టచ్ లో ఉండాలని కోటంరెడ్డికి చంద్రబాబు చెప్పారని ఆరోపించారు పేర్ని నాని. కోటంరెడ్డి జగన్ కు నమ్మకద్రోహం చేశారని వండిపడ్డారు. మా ఎమ్మెల్యేలపై మేమే ఎందుకు నిఘా పెట్టుకుంటామని ప్రశ్నించారు. సీఎం జగన్ పై కోటంరెడ్డి చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version