కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సీఎం జగన్ వార్నింగ్‌ ఇస్తారా.. వెర్రీ గుడ్ అంటారా..?

-

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సీఎం జగన్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అర్జంట్ గా తాడేపల్లి వచ్చి జగన్ ని కలవాలనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. సరే మీరు చెప్పినట్టుగానే వస్తానని సమాధానం చెప్పి ఫోన్ పెట్టేశారు శ్రీధర్ రెడ్డి. అంత అర్జంట్ గా ఓ ఎమ్మెల్యేకి సీఎం నుంచి ఫోన్ ఎందుకొచ్చింది. పోనీ మంత్రి వర్గ విస్తరణా అంటే అదీ లేదు. లేదా 2024కి టికెట్లు కన్ఫామ్ చేస్తున్నారా అంటే అదీ లేదు. నామినేటెడ్ పోస్ట్ లు కూడా దగ్గర్లో లేవు. మరి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి సీఎం ఆఫీస్ నుంచి ఎందుకు ఫోన్ వచ్చింది. అసలేం జరుగుతోంది..?.. నేడు సాయంత్రం ముఖ్యమంత్రితో కోటంరెడ్డి భేటీకానున్నారు. ఇటీవల అధికారుల తీరుపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు శ్రీధర్ రెడ్డి.

 

గత నెల 23న అధికారులతో సమీక్ష సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సౌత్ మోపూరులోని మొగిలిపాలెం వద్ద సవిటి వాగు తెగిపోయి దాదాపు 150 ఎకరాల వరకు పంట పొలాలు నీటమునిగాయి. అధికారుల వైఖరి కారణంగానే ఇలా జరిగిందంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు చేశారు. పై నుంచి ఎంత వరద వస్తుందో తెలియదా అంటూ ఇరిగేషన్ అధికారులను కడిగిపారేశారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధుల‌ మంజూరుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు వేస్తున్నారని ఆరోపించారు శ్రీధర్ రెడ్డి. తాను అందరు ఎమ్మెల్యేల్లాగా ఉండబోనని, తాడోపేడో తేల్చుకుంటానన్నారు. ప్రజలకోసం ఎంతదూరం అయినా వెళ్తానని, అన్నిటినీ మౌనంగా భరించే వ్యక్తిని మాత్రం తాను కాను అని చెప్పారు. నెల్లూరు రూరల్ లో రోడ్ల నిర్మాణంతో జనం ఇదేం ఖర్మ అనుకుంటున్నారని కూడా అన్నారు శ్రీధర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version