చంద్రబాబు అవినీతి చేసి వ్యవస్థలను మేనేజ్ చేశాడు : మంత్రి కొట్టు

-

టీడీపీ అధినేత చంద్రబాబునాయుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది! పలు మౌలిక సదుపాయాల కంపెనీల నుంచి చంద్రబాబుకు రూ.118 కోట్లు ముట్టాయని ఐటీ శాఖ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కొట్టు మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు చేసిన పాపాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. చంద్రబాబు దగ్గర దొరికించి చాలా తక్కువ అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు, స్కిల్ డెవలప్‌మెంట్, ఇసుక.. ఇలా అన్నింటా దోచిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.

మేనేజ్ చేయడంలో నిపుణుడు కాబట్టి అవినీతికి పాల్పడిన తర్వాత వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దోపిడీకి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసు కేవలం శాంపిల్ అని మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. టిడ్కో ఇళ్ల పేరుతో పేదల నుండి ఒక్కొక్కరి దగ్గరి నుండి రూ.3 లక్షలు దోచుకున్నాడన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. డబ్బులు రాని ఆరోగ్యశ్రీ, 108 వంటి వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. తాను ఇరుక్కుపోతానని ముందే తెలియడం వల్లే నాలుగు రోజులుగా ఢిల్లీలో కాళ్లబేరానికి వెళ్లాడని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version