ఏపీ రాజకీయాల్లో ఉప్పు నిప్పుగా ఉన్న వైసీపీ,టీడీపీ కలిసి పనిచేయడం అంటే కాస్త విడ్డూరంగానే ఉంటుంది. అయితే కృష్ణాజిల్లాలో ఇసుక మాఫియా కొత్త అవతారం ఎత్తింది. తమపర భేదం లేకుందా అధికార,విపక్ష సభ్యులు అంత కలిసి పంచేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో అనధికార తవ్వకాలకు పాల్పడిన ఈ మాఫియా.. ఆ కిటుకులు కొందరు అధికార పార్టీ నేతలకు చెప్పిందట. ఇదేదో బాగుందని అనుకున్నారో ఏమో.. మనం మనం బరంపురం అనుకుంటూ ట్రాక్టర్లు, టిప్పర్లు కొనుగోలు చేసి రెండు పార్టీల నేతలు భారీగా వెనకేసుకుంటున్నారట.
ఏపీలో ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ అనేది ఫార్సుగా మారింది. ప్రతికూలతలను అవకాశంగా తీసుకుని బల్క్ బుకింగ్ పేరిట అక్రమ సంపాదనకు తెరతీసింది ఇసుక మాఫియా. ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ అవ్వక ఇబ్బంది పడుతున్న వారికి అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటోంది. .భవన నిర్మాణాలు చేసుకోవటానికి ఇసుక కావాల్సిన వారంతా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఇంటికి నేరుగా ఇసుక వస్తుంది. రవాణా చెల్లింపులను టన్ను ఇసుక ధరతో కలిపి చెల్లిస్తే సరిపోతుంది. కానీ ఆ సైట్ పని చేయదు. దీంతో ఇసుక అవసరం ఉన్నవారిపై కన్నేసింది మాఫియా. బల్క్ బుకింగ్ కాన్సెప్ట్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటోంది.
కృష్ణా జిల్లా రాజకీయాల్లో మీడియా మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న వైసీపీ,టీడీపీ నేతలే ఈ దందా వెనుక ఉన్నట్లు తెలుస్తుంది.
ఆదాయం తెచ్చిపెట్టే ఈ దందాలో అధికార, విపక్ష నేతలు పరస్పరం సహకరించుకుంటున్నారు. గత టీడీపీ సర్కార్ హయంలో జరిగిన ఇసుక దందా వ్యవహారం పొలిటికల్ గా టీడీపీనీ బాగా డ్యామేజ్ చేసింది. అప్పుడు కథ నడిపించిన నేతలే మళ్లీ వైసీపీ ప్రభుత్వంలోను కీలకపాత్ర పోషిస్తున్నారు.
ప్రభుత్వ ఆమోదం పొందిన ప్లానును తహసిల్దార్ ద్వారా జాయింట్ కలెక్టర్‌కు పంపి ఒకేసారి 100 నుంచి 1000 టన్నుల వరకు ఇసుకను కొనుగోలు చేసుకునే అవకాశాన్ని బల్క్ బుకింగ్ ద్వారా ప్రభుత్వం కల్పించింది. ఈ కాన్సెప్ట్‌నే తమకు ఆదాయ వనరుగా మార్చుకుంది ఇసుక మాఫియా. అక్రమాలను చేస్తున్నా ఎస్ఈబీ దానిపై దృష్టిపెట్టిన దాఖలాల్లేవు. బల్క్ బుకింగ్ స్కామ్‌పై SEB ఫోకస్ పెట్టకపోవటానికి మాఫియా వెనక అధికార పార్టీ నేతలు ఉండటమే కారణమట. ఇప్పటికే ఇసుక వ్యవహారంలో ఇబ్బందిపడుతున్న ప్రభుత్వం ఈ సిండికేట్ దందాని ఎలా అరికడుతుందో చూడాలి.