Krishna Vamshi: నీ సినిమా తప్ప అన్నీ నీకు ఇంట్రెస్టే..కృష్ణవంశీపై నెటిజన్ కామెంట్..ఆయన రియాక్షన్ ఇదే..

-

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ..ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయారు. వరుసగా తనకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ ఫిల్మ్ షూటింగ్ లొకేషన్ కు ఇటీవల వెళ్లిన కృష్ణవంశీ..ఆయనకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చినట్లు టాక్.

ఈ క్రమంలోనే తాజాగా స్టివెన్ స్పీల్ బర్గ్ ఫిల్మ్ ‘వెస్ట్ సైడ్ స్టోరిస్’ చూశానని, అది తనకు చాలా బాగా నచ్చిందని కృష్ణ వంశీ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అది చూసి ఓ నెటిజన్ ..కృష్ణవంశీని ఉద్దేశించి నెగెటివ్ వేలో కామెంట్ చేశాడు. ‘‘నీకు అన్నీ ఇంట్రెస్టే.. నీ సినిమా తీయడం పూర్తి చేసి విడుదల చేయడం తప్ప’’ అని పోస్టు పెట్టాడు.

అది చూసి నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కృష్ణవంశీ స్థాయి, ఆయన తీసిని సినిమాల గురించి నీకు తెలుసా అసలు? అని కొందరు నెటిజన్లు సదరు నెటిజన్ ను ప్రశ్నించారు.

సదరు నెటిజన్ కామెంట్ కు దిమ్మదిరిగిపోయే రిప్లయి ఇచ్చారు కృష్ణవంశీ. ‘‘గాడ్ బ్లెస్ యూ..’’ అంటూ ఓ లవ్ సింబల్ పోస్ట్ చేశారు క్రియేటివ్ డైరెక్టర్. కృష్ణవంశీ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ అనే చిత్రం చేస్తున్నారు. ఇది పూర్తి కాగానే ‘అన్నం’ అనే సినిమా చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version