సింహం సింగిల్ గా వస్తుంది… పందులు గుంపులుగా వస్తాయి : కేటీఆర్‌

-

వికారాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు . సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే మళ్లీ బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తాయన్నారు. దళిత బంధు, కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ , వృద్ధులకు పింఛన్, వితంతులకు పింఛన్, వికలాంగులకు పింఛన్ మరెన్నో పథకాలు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మూడు గంటల కరెంటు ఇస్తామని అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు రైతులకు కరెంటు ఇస్తుంది అని అన్నారు. ఒక్క కేసీఆర్ ని ఢీకొట్టడానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లు మనుషులను తెచ్చకుంటున్నారన్నారు. అయినా సింహం సింగిల్ గా వస్తుంది… పందులు గుంపులుగా వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

శంకర్ పల్లి లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, షాబాద్ లోని చందన వెళ్లి లో పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గం లో 84 గ్రామాలకు గుదిబండ లాగా తయారైన 111 జీవో గత ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా రద్దు చేయడం జరిగిందని, కొంత న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని వాటిని పరిష్కరించడానికి కూడా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే 84 గ్రామాలకు రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. రైతులకు రైతుబంధు పథకాన్ని 70 లక్షల మంది రైతులు ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్టు, తదితర పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version