తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. రైతులపై ప్రశంసల వర్షం కురిపించిన మంత్రి కేటీఆర్.. రైతులకు ఒక్కొక్కరికి 100 గజాల ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ టెక్స్ టైల్ పరిశ్రమకు భూమిపూజ జరిగింది.
ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రైతులు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నాడని… అయితే ఇప్పటికే పది ఛాన్సులు ఇచ్చారని అన్నారు. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్లు అధికారాన్ని అప్పచెప్పారని…దేశంలో కరెంట్ ఇవ్వలేని, నీళ్లు ఇవ్వలేని అసమర్థ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. రాహుల్ గాంధీ దివాలాకోరు మాటలు మాట్లాడారని విమర్శించారు. రిమోట్ కంట్రోల్ పాలన ఎవరిదో తెలియదా… 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ ప్రధాన మంత్రి అని… మమ్మీ గారి చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంచుకొని ప్రధాని మన్మోహన్ సింగ్ ను బొమ్మగా ఆడించింది మీరు కాదా..? అని ప్రశ్నించారు.