WORLD RECORD: బ్రాడ్ హాగ్ రికార్డును కొల్లగొట్టిన కుల్దీప్ యాదవ్ !

-

ఈ రోజు అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్యన జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘనవిజయాన్ని అందుకునేందుకు సమీపంలో ఉంది. ఇండియా లెఫ్ట్ హ్యాండ్ మణికట్టు స్పిన్నర్ ఒకే ఒక్క ఓవర్ లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి మలుపు తిప్పేశాడు. కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో షకీల్ మరియు ఇఫ్తికార్ లను అవుట్ చేయడం ద్వారా ఇండియా మ్యాచ్ పై పట్టు బిగించింది. ఈ రెండు వికెట్లను సాధించడం ద్వారా కుల్దీప్ యాదవ్ వన్ డే కెరీర్ లో 157 వికెట్లను అందుకున్న ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ రోజు వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన లెఫ్ట్ హ్యాండ్ మణికట్టు స్పిన్నర్ బ్రాడ్ హాగ్ పేరిట ఉండేది. ఇప్పుడు ఈ ఘనతను కుల్దీప్ యాదవ్ సొంతం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై కుల్దీప్ యాదవ్ రెండు కీలక వికెట్లు సాధించి పతనాన్ని శాసించాడు. ముందు ముందు కుల్దీప్ యాదవ్ ఇండియా విజయాలలో కీలక పాత్రను పోషించాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version