విజయ్ దేవరకొండ, సమంత ‘ఖుషి’ టైటిల్ సాంగ్ రిలీజ్

-

శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మజిలీ సినిమా తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా.. మహానటి సినిమా తరువాత సమంత-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమపై మొదటి నుండి మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. సెప్టెంబర్ 1వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్.

ఇప్పటికే నా రోజా నువ్వే, ఆరాధ్య సాంగ్స్ వచ్చి అందరినీ మెస్మరైజ్ చేయగా ఇప్పుడు తాజాగా ఖుషి థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఖుషి అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ ఇప్పుడు అభిమానులను మాత్రమే కాదు అందరినీ ఆకట్టుకుంటోంది. నా రోజా నువ్వే పాటకు సాహిత్యం అందించి ఆకట్టుకున్న శివ నిర్వాణ ఈ పాటకు కూడా సాహిత్యం అందించగా మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వయంగా ఆలపించారు. ఇక హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన ఈ బాణీ ఎంతో వినసొంపుగా ఉందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సాంగ్ లో ఉన్న విజువల్స్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నీట్ గా ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version