Lal salaam: రజనీ కాంత్ వస్తున్నా.. సందడి లేదు

-

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం లాల్ సలాం. సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా అంటే ఉండే హైపే వేరు. అయితే ఆయన నటించిన ‘లాల్ సలామ్’ మూవీ ఎలాంటి హడావుడి లేకుండా రేపు విడుదల కానుంది. రజినీ ఉన్న సినిమాకి ప్రచారం లేకపోవడం ఏంటని నెట్టింట పలువురు పోస్టులు చేస్తున్నారు. మరోవైపు చిన్న సినిమాగా వస్తున్న డబ్బింగ్ మూవీ ‘ట్రూ లవర్’కు కాస్త బజ్ ఉందని చర్చ నడుస్తోంది.

ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రం ఈ నెల ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ అతిథి పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version