పఠాన్ చెరులో రెచ్చిపోయిన భూ మాఫియా.. ఒకే సారి 100 మంది!

-

సంగారెడ్డి జిల్లాలోని పఠాన్ చెరులో ల్యాండ్ మాఫియా ఒక్కసారిగా రెచ్చిపోయింది. డిఫెన్స్ కాలనీలో కోట్ల రూపాయల విలువ చేసే స్థలం కబ్జాకు యత్నించినట్లు తెలుస్తోంది. ప్రైవేటు ల్యాండ్‌లోకి దౌర్జన్యంగా చోరబడిన 100మంది దుండగులు నానా హడావుడి చేశారు. చుట్టు పక్కల వారు భయాందోళనకు గురయ్యేలా వారి చేష్టలు ఉన్నాయి.

ఈ దృశ్యాలు స్థానికంగా బిల్డింగులకు ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ భూ మాఫియా దౌర్జన్యంపై స్థానికంగా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ల్యాండ్ మాఫియా మొత్తం పఠాన్ చెరు ఎమ్మెల్యే తమ్ముడి అనుచరులుగా అనుమానిస్తున్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version