ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు పార్టీ మధ్య ఉన్న ఫైట్ కాస్తా ఇప్పుడు కులాల మధ్యకు చేరింది. ప్రస్తుతం అగ్రకులాల మధ్య చిచ్చు రాజుకుంది. ముఖ్యంగా క్షత్రియ కులానికి చెందిన నేతలు పార్టీల వారీగా వర్గపోరుకు దిగుతున్నారు. వారికులానికి చెందిన నేతలపై వారే స్వయంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఇక టీడీపీ మాజీ ఎంపీ అయిన అశోక్ గజపతిరాజుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా నిన్న క్షత్రియ సామాజికవర్గం ఓ ప్రకటన ఇచ్చింది. దీంట్లో గజపతిరాజుపై వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు కావాలని అసభ్య భాషతో విమర్శలు చేశారని మండిపడ్డారు.
దీన్ని తాము ఖండిస్తున్నట్టు చెప్పారు. కాగా ఈ ప్రకటన చూస్తుంటే వైసీపీకి కౌంటర్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీలోని క్షత్రియ వర్గానికి చెందిన మంత్రి రంగనాథరాజు రీ కౌంటర్ ఇచ్చేశారు. వైసీపీపై క్షత్రియుల పేరుతో వచ్చిన ప్రకటన ఎవరిదో కూడా తెలియకుండా ఉందని, అసలు అది నిజమైన క్షత్రియులు పంపింది కాదని చెప్పారు. దీంతో ఇటు టీడీపీ అటు వైసీపీ మధ్య కులాల చిచ్చు రగులుకుంది.