అనారోగ్య సమస్యల కారణంగా టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలియడంతో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ తొలుత సంతాపం వ్యక్తం చేశారు.అయితే, టాటా ఇకలేరనే విషయాన్ని ముందుకు ప్రముఖ వ్యాపారవేత్త హర్షగోయెంగా ట్వీట్ ద్వారా అందరికీ తెలియజేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.
రతన్ టాటా(86) ఇక లేరన్న నిజాన్ని అంగీకరించలేకపోతున్నానని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తాజాగా స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మకమైన స్థానంలో ఉండటానికి రతన్ టాటా దేశానికి అందించిన సేవలు కూడా ఒక కారణమని గుర్తుచేశారు. ఆయన మార్గదర్శకత్వం భవిష్యత్ తరానికి ఎంతో అమూల్యమైనదని కొనియాడారు. ఆయన సంస్కరణలను పాటించడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి. ‘మిస్టర్ టి’కి ఇక గుడ్ బై. మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోను. ఎందుకంటే లెజెండ్స్‌కు ఎప్పటికీ చావు ఉండదు’అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.