పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పాలకొండ డివిజన్‌లో ఏనుగుల బెడద అధికంగా ఉందని.. ఆస్తి , ప్రాణ నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక గజరాజులతో జరిగిన నష్టానికి పరిహారం అందిస్తామని ఆయన హమీ ఇచ్చారు.
డిజిటల్ హెల్త్ కార్డ్స్ అందిస్తామని,పదవీ విరమణ తరువాత ఉద్యోగులు భయపడకూడదని.. సీపీఎస్ లేదా తత్సమాన పరిష్కారం అందిస్తామన్నారు. ఉద్యోగులను అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తామన్నారు. ఉద్దానం కిడ్నీ సమష్యలకు సంపుర్ణ పరిష్కారం వచ్చేంత వరకూ కృషి చేస్తాము. జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు సరిపోదా అంటూ పవన్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాలకొండను బంగారుకొండ చేసుకుందాం అని పిలుపునిచ్చారు. దశాబ్దం తరువాత ఆభ్యర్థిస్తున్నా , అర్థిస్తున్నా , కూటమి అభ్యర్దులను భారీ మెజారిటీతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.