మైక్ టైసన్ బర్త్ డే సందర్భంగా “లైగర్” టీం స్పెషల్ వీడియో

-

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్ ‘. ఈ సినిమాలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 70 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ దేవరకొండ తండ్రిగా మైక్ టైసన్ కనిపించనున్నాడు. అయితే నేడు లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ పుట్టినరోజును పురస్కరించుకొని లైగర్ టీం బర్త్డే విషెస్ తెలిపింది.

విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరి, ఛార్మి, కరణ్ జోహార్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ వీడియోని షేర్ చేశారు. మైక్ టైసన్ ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, ఇలాంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని వారు కోరుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో లైగర్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. కగా ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది లైగర్ మూవీ. లైగర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏకంగా 65 కోట్లకు అమ్ముడయ్యాయి అన్నది టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version