ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర తాను మోకరిల్లానంటూ కొందరు విమర్శిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నేను ఆ సన్నాసుల్లా నాలుగు గోడల మధ్య కలవలేదు అని మోడీ కడుపులో తలకాయ పెట్టలేదు అన్నారు. మంచితనం చేతగాని తనం కాదు. మన మర్యాద రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది అని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి గానీ సంఘర్షణ ఉండొద్దు అని సూచించారు.అందుకే మోడీకి సమస్యలను వివరించా. కేంద్రం మన సమస్యలను తీర్చకుంటే నిలదీసే బాధ్యత నాది’ అని హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11 నుంచి ప్రారంభించబోతున్నామని అన్నారు.ప్రభుత్వం ఏర్పాటుచేసి రేపటికి 90 రోజులు అవుతుందన్నారు. ఇప్పటికే ఆరోగ్యరంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు, ఉచిత విద్యుత్ , రూ.500కే సిలిండర్ హామీలను అమల్లోకి తెచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్-1 తో పాటు డీఎస్సీ, ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చామని పేర్కొన్నారు.