నిన్న ఉదయం బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ మరియు నిన్నటి వరకు వన్ డే కెప్టెన్ గా ఉన్న తమీమ్ ఇక్బల్ సడెన్ గా అన్ని ఫార్మాట్ ల నుండి తప్పుకుంటున్నాను అంటూ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బంగ్లా అభిమానులు చాలా బాధలో ఉన్నారు, తమీమ్ ఇక్బల్ ఫ్యాన్ ఒకతను అయితే ఈ విషయం తెలిసిన వెంటనే చాలా ఏద్వడం సంచలనంగా మారింది. కాగా తాజాగా ఆ జట్టు ఆటగాడు లిటన్ దాస్ ను మీడియా సమావేశంలో ఈ విషయం గురించి ప్రశ్నించగా, అతను ఏ మాత్రం సమాధానము చెప్పకుండా మీరు ఈ విషయం గురించి నాతో మాట్లాడాలి అనుకుంటే… నేను వెళ్లిపోతాను, మా టీం యాజమాన్యాన్ని అడగండి అంటూ కోపం తెచ్చుకున్నాడు. ప్లేయర్ లు అంతా ఎప్పటిలాగే కలిసి కట్టుగా, దేశం కోసం మాత్రమే ఆడుతున్నాము.
తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ గురించి నన్ను అడగొద్దు: లిటన్ దాస్
-