వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.. లోకేశ్ ! ఇది ఫిక్స్ భ‌య్యా !

-

తెలుగుదేశం పార్టీ నాయ‌కత్వంలో భారీ మార్పులు రానున్నాయి అని తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో ఉద్య‌మ స్థాయిలో  ఇంకా కొన్ని మార్పులు రావాలంటే బ‌లం పుంజుకుని ప‌రుగులు తీయాలంటే ఆ పాటి మార్పులు త‌ప్ప‌వు. అదేవిధంగా చిన‌బాబుకు కొత్త ప‌ద‌వి ఇచ్చేందుకు బాబు స‌న్న‌ద్ధం అవుతున్నారు. కానీ చిన‌బాబు స‌మ‌ర్థ‌త‌పై చాలా అంటే చాలా అనుమానాలు పార్టీలోనే ఉన్నాయ‌న్న‌ది ప‌రిశీల‌కుల మాట. క‌నుక చిన‌బాబు క‌నుక పాద‌యాత్ర చేస్తే కొన్ని దిద్దుబాటుకు నోచుకుని పార్టీ పున‌రుత్థానం  చెంద‌డం ఖాయం.

మంచివాడు ఎన్టీఆర్.. ఆయ‌న స్ఫూర్తితో నాయ‌కులు ఎదిగివ‌చ్చారు. మ‌హా శ‌క్తిగా ఉన్న కాంగ్రెస్ ను ఢీ కొని గొప్ప నాయ‌కులుగా ఎదిగిన వైనంలో ఎన్టీఆర్ ఉన్నారు ఆ వేళ. అప్పుడూ ఇప్పుడూ గొప్ప‌వాడు ఎన్టీఆర్. ఆ మాట‌లో  కించిత్ అనుమానం లేదు. ఆయ‌న బాట‌లో తెలుగుదేశం పార్టీ న‌డుస్తోంది. ఎదిగివ‌స్తోంది. కొన్ని ఓట‌ములున్నా కూడా మంచి దిశ‌గా ప్ర‌యాణించేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.

తెలుగుదేశం పార్టీ త‌ప్పులు చేయ‌లేదా ? చేసింది .. వాటిని ఇప్ప‌టి అధినేత చంద్ర‌బాబు నాయుడు ఒప్పుకున్నారు. పాల‌న ప‌రంగా ప‌రిణితిని సాధించాల్సిన స‌య‌మంలో త‌ప్ప‌ట‌డుగులు వేశారు. అవే ఆయ‌న‌కు కాస్త త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆయ‌న‌కు అండగా మ‌రికొంద‌రు నాయ‌కులు నిల‌బ‌డి ప‌రుగిడి ప‌నిచేయాల్సి ఉంది.

పార్టీకి జ‌వం జీవం ఇచ్చే విధంగా కొన్ని మార్పులు తీసుకు రావాల‌ని బాబు యోచిస్తున్నారు. ఆ విధంగా లోకేశ్ ను వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల‌ని యోచిస్తున్నారు అని స‌మాచారం.ఇప్పుడిప్పుడే నాయ‌కుడిగా యాక్టివ్ అవుతున్న లోకేశ్ ముందున్న కాలంలో ఇంకా బాగా ప‌నిచేయాల్సి ఉంది. ఆ విధంగా ఆయ‌న త‌న‌ను తాను దిద్దుకోవాల్సి ఉంది. అదేవిధంగా పార్టీని ముందుకు న‌డిపే క్ర‌మంలో మిగిలిన నాయ‌కుల‌ను క‌లుపుకుని పోవాల్సిన ఆవ‌శ్య‌క‌త కూడా ఉంది. ఈ క్ర‌మంలో లోకేశ్ ఒక‌ప్ప‌టి త‌ప్పులు చేయ‌కూడ‌దు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కాకున్నా ఆయ‌న నాయ‌క‌త్వంపై కొంద‌రికి న‌మ్మ‌కాలు లేవు. ఆ న‌మ్మ‌కాలు ఆయ‌న కలిగిస్తే మేలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version