మీ ఫోన్ పోయిందా? ఇలా చెయ్యడం మర్చిపోకండి..

-

ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లను వాడుతున్నారు.. లావాదీవీల నుంచి పర్సనల్ డేటాను ఫోన్లో స్టోర్ చేస్తున్నారు.అలాంటి విలువైన ఫోన్ పొగొట్టుకుంటే.. మీ డేటా రిస్క్‌లో పడినట్టే.. మనలో చాలా మంది క్యాబ్‌లలో ప్రతిరోజూ ప్రయాణిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో తమ ఫోన్‌లను మరచిపోతుంటారు. మీరు క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నట్లయితే.. డేటా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు మీరు కొన్ని విషయాలను తప్పక గుర్తించుకోండి..

ఫోన్ ను ట్రాక్ చెయ్యడం..

ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం Find My Device, Apple iPhoneల కోసం Find My iPhone ఫీచర్ వంటి ఫీచర్‌లతో, మీ ఫోన్‌ని ట్రాక్ చేయడం సులభం. మీరు డివైజ్ ఆన్‌లైన్‌లో ఉంటే.. మాత్రమే దాని లొకేషన్ చూడవచ్చు. మీ డివైజ్ ఆఫ్‌లైన్‌లో ఉన్నట్లయితే.. డివైజ్ నిలిపివేయడానికి ముందు దాని ఆఖరి లొకేషన్ కనిపిస్తుంది.

మీ డేటాను డిలీట్ చెయ్యడం..

రిమోట్ గా డేటాను డిలీట్ చెయ్యొచ్చు..ఎందుకంటే ఫోన్లో డేటా చాలా విలువైనది. అది తప్పుడు చేతుల్లో పడితే దుర్వినియోగం కావచ్చు. శుభవార్త ఏమిటంటే ఈ డేటాను డివైజ్ నుంచి రిమోట్‌గా తొలగించవచ్చు. iPhone యూజర్ల కోసం, మీరు iCloud.comని విజిట్ చేయడం ద్వారా డివైజ్ ఎక్కడ ఉందో సులభంగా కనుగొనవచ్చు. ఎంచుకున్న డివైజ్ నుంచి డేటాను వెంటనే తొలగించవచ్చు. డివైజ్ లింక్ చేసిన Google అకౌంట్ కలిగిన Android ఫోన్‌ల కోసం Find My Device అనే ఫీచర్ ఆటోమాటిక్‌గా ఆన్ అవుతుంది. మీ ఫోన్లో డేటాను డిలీట్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగించవచ్చు..

సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను మార్చుకోవడం..

మీ ఫోన్ ఎవరి వద్ద ఉందో, వారు మీకు ఎలా హాని కలిగించే ప్రయత్నం చేస్తారో మీకు ఎప్పటికీ తెలియదు. సోషల్ మీడియాలో ఒకరి గుర్తింపును తారుమారు చేసేందుకు, స్కామ్‌లకు పాల్పడుతున్నారు. అందువల్ల, మీ అన్ని సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడూ మారుస్తు ఉండాలి. ఆ రిస్క్ నుంచి సురక్షితంగా ఉండటానికి మీరు అన్ని డివైజ్‌ల నుంచి లాగ్ అవుట్ అయ్యేలా చూసుకోండి..

సిమ్ ను బ్లాక్ చెయ్యండి..

ఫోన్ పోయిన వెంటనే సిమ్ ను డియాక్టివేట్ చెయ్యాలి..OTP వెరిఫికేషన్ చాలా అవసరం. అందుకే మీ ఫోన్‌కు OTPలు వస్తాయి. అప్పుడు మరొకరి చేతుల్లో మీ డేటా పడకుండా ఉండాలంటే వెంటనే మీ నెట్‌వర్క్ ప్రొవైడర్‌కు కాల్ చేసి సిమ్ ను బ్లాక్ చేయించాలి..

మీ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లన్నింటినీ మార్చుకోవడం..

ఫోన్ ల నుంచే లావాదీవీలు చేస్తున్నారు.. బ్యాంకు డిటైల్స్ అందులోనే ఉంటుంది..మీ పర్సనల్ డేటాను ఉపయోగించవచ్చు. మీ అకౌంట్లను పొందవచ్చు. మీ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లన్నింటినీ మార్చుకోవడం మంచిది. షాపింగ్ మొదలైనప్పుడు మీ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు ఆటోమాటిక్‌గా సేవ్ చేయడం కుదరదు. అలాగే, మీరు మీ ఫోన్‌లో ఎక్కడైనా ATM పిన్‌లు, నెట్ బ్యాంకింగ్ పాస్‌కోడ్‌లు మొదలైన సున్నితమైన డేటాను స్టోర్ చేస్తే సంబంధిత బ్యాంకుకు సమాచారన్ని అందించాలి.. ఇది అసలు మరిచిపోకండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version