విదేశాలకు మేడిన్ ఇండియా ఆయుధాలు.. రూ.21వేల కోట్ల సేల్స్

-

2014లో కొత్తగా ఏర్పాటైన మోడీ సర్కార్ తీసుకున్న మేడిన్ ఇండియా కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటికే చాలా వరకు ఆయుధాలు, స్పేర్ పార్ట్స్, ఢిఫెన్స్ సామగ్రిని దేశీయంగా అభివృద్ధి చేస్తున్నారు. ఒకప్పుడు అమెరికా, రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలను కొనుగోలు చేసేది. కానీ, ఇప్పుడు దేశీయంగా ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, డీఆర్డీవో, కొన్ని ప్రైవేట్ కంపెనీల సాయంతో మన ఆర్మీ కోసం వెపన్స్ లోకల్‌గా తయారుచేస్తున్నారు.

అంతేకాకుండా, ఇండియా ఇతర దేశాలకు మేడిన్ ఇండియా వెపన్స్‌ను అమ్ముతోంది. ఈ క్రమంలోనే 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ రూ.21,083 కోట్ల విలువైన ఆయుధాలను విదేశాలకు ఎగుమతి చేసింది. ప్రస్తుతం రూ.1.2లక్షల కోట్లుగా ఉన్న ఆయుధాల తయారీ సామర్థ్యాన్ని 2028-29 ఏడాది వరకు రూ.3 లక్షల కోట్లకు పెంచాలని, ఎగుమతులు రూ.50వేల కోట్లకు పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. అందుకోసం 16 పబ్లిక్ సెక్టార్, 430 కంపెనీలు, 16వేల ఎస్ఎంఈలతో ఇండస్ట్రీని కేంద్రం విస్తరించింది. అంతేకాకుండా, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని 21 శాతానికి పెంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version