Mahesh Babu: ‘సర్కారు వారి పాట’లో ఇంకా యంగ్ మహేశ్..హీరో గ్లామర్ సీక్రెట్ రివీల్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రోజురోజుకూ ఇంకా యంగ్ అయిపోతున్నారు. సినిమా సినిమాకు ఏజ్ పెరగాల్సింది పోయి ఇంకా తగ్గుతోందని సినీ అభిమానులు అంటున్నారు. సూపర్ స్టార్ మహేశ్ నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ నెల 12న ఫిల్మ్ విడుదల కానుంది.

‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’లో మహేశ్ ఇంకా యంగ్ గా కనబడుతున్నారు. కాగా, ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా పని చేసిన రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ తాజాగా..మహేశ్ సీక్రెట్ రివీల్ చేశారు.

‘సర్కారు వారి పాట’ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే మహేశ్ గ్లామర్ సీక్రెట్ చెప్పేశారు. సూపర్ స్టార్ మహేశ్ గ్లామర్ సీక్రెట్ వ్యాయామం అని తెలిపారు. తాము మహేశ్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం కూడా పని చేశామని, ఆ సినిమా షూటింగ్ కోసం కశ్మీర్ వెళ్లామని గుర్తు చేసుకున్నారు. అక్కడ విపరీతమైన చలి ఉన్నప్పటికీ మహేశ్ బాబు పొద్దున్నే లేచి వ్యాయామం చేసేవాడని చెప్పుకొచ్చారు.

డే మొత్తం షూట్ చేసినప్పటికీ ఈవినింగ్ టైమ్స్ లో మహేశ్ వ్యాయామం చేసేవారని మాస్టర్స్ చెప్పారు. మహేశ్..ఎట్టి పరస్థితుల్లోనూ వ్యాయామం స్కిప్ చేయబోడని, అందుకే ఆయన చాలా హ్యాండ్సమ్ గా, గ్లామర్ గా కనిపిస్తారని వివరించారు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్.

Read more RELATED
Recommended to you

Latest news