సోయాబీన్స్ తో ఇలా దోశలు చేసేయండి..? మాములు వాటికంటే మస్త్ టేస్ట్ కమ్ హెల్దీ

-

సోయాబీన్స్ లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. వీటిని తినాలంటే.. ఇక ఉడకపెట్టుకుని కూరల్లో వేసుకోవడమే చేయాలి. కూరల్లో మాత్రం ఎంతని వేస్తాం. అందులోనూ డైలీ వేస్తే మనకు తినాలనే మూడ్ పోతుంది. మన దేశంలో 90 శాతం మంది ప్రొటీన్ లోపంతో బాధపడుతున్నారు. హైలెట్ ఏంటంటే.. మనకు ప్రొటీన్ లోపం ఉందని మనకే తెలియదు. సోయా ప్రోటీన్ లోపం భర్తీ చేస్తుంది. మరీ దీన్ని డైలీ తినాలంటే.. కూరల్లో వేసుకోవడం ఒక్కటే మార్గం అనుకుంటారు. పచ్చిదా తినలేం. అసలు పచ్చి సోయా తినకూడదు. మరి ఇంక ఎలా సోయాను మన డైట్ లో భాగం చేసుకోవాలి.? మనకు ఎలాగూ దోశలు అంటే పిచ్చి. రోజు తినమన్నా తింటాం.. నార్మల్ దోశలు ఆరోగ్యానికి మంచిది కాదు కదా.. మరీ ఆ ప్లేస్ లో సోయా దోశలు వేసుకోవచ్చు కదా..! ఈరోజు హెల్దీ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దామా..
సోయాబీన్ దోశలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
12 గంటలు నానపెట్టిన సోయాచిక్కుడు గింజలు 1కప్పు
3 గంటలు నానపెట్టిన ముడిబియ్యం 1 కప్పు
కొబ్బరి తురుము అరకప్పు
పచ్చిమిర్చి 2
అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్
జీలకర్ర 2 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ 2 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి చిన్నముక్కలు 1టేబుల్ స్పూన్
పుల్లమజ్జిగ ఆఫ్ కప్పు
కొత్తిమీర కొద్దిగ
నిమ్మరసం కొద్దిగ
తయారు చేసే విధానం:
నానపెట్టిన సోయాచిక్కుడు గింజలను బాగా తొక్కతీస్తూ కడిగి.. మిక్సీజార్ లో వేసి అందులోనే కొబ్బరితురము, బియ్యం, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర వేసి గ్రైండ్ చేయండి. అందులో నిమ్మరసం కొద్దిగా, పుల్లమజ్జిగ వేసుకోని దోశలు పిండిలా కలుపుకోండి. నానస్టిక్ పాన్ తీసుకుని దోశ వేసి.. దానిపైన జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టి స్లో ఫ్లేమ్ లో మెల్లగా కాలనివ్వండి. ఒక సైడ్ కాలనిస్తే చాలు.. ఆ తర్వాత తీసేయడమే.
కాంబినేషన్ గా చట్నీ తయారు చేసే విధానం..
వీటికి కాంబినేష్ గా ఇన్స్టెంట్ చట్నీ కూడా ఉంది. మిక్సీజార్ తీసుకుని అందులో కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పొడి, నిమ్మరసం, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి లైట్ గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా వద్దు. అందులోకి గట్టి పెరుగు వేయండి. కొంచె అరస్పూన్ నీళ్లు కలిపి మళ్లీ గ్రైండ్ చేయండి. గ్రీన్ చట్నీ రెడీ. సోయాబీన్ దోశల్లోకి ఈ గ్రీన్ చట్నీ సూపర్ ఉంటుంది. ఈ వెరైటీ టిఫెన్ ను వీకెండ్స్ చేసుకోని తీనొచ్చు.
సోయాను ఎలా వాడినా వెంట్రుకలు బాగా ఎదుగుతాయి. రోజుకు 50 గ్రాములు చొప్పున వాడితేనే.. 15-20 రోజుల్లోనే.. జుట్టు గ్రోత్ బాగుంటుందట. స్త్రీలకు ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా పెరుగుతుంది. కాబట్టి.. మాములు దోశలు తినేబదులు.. వారానికి మూడురోజులైనా ఇలాంటి దోశలు చేసుకుని తినడానికి ట్రై చేయండి. అన్ని గంటలు నానపెట్టడం పెద్ద పని కూడా కాదు.. ఈవినింగ్ నానపెడితే.. మార్నింగ్ రెడీ అవుతాయి. సాయంత్రం పూట వేసుకోవాలి అంటే.. ఉదయం నానపెట్టుకుంటే చాలు. సోయాను ఏదో ఒక రూపంలో వాడుకుంటే.. ఆరోగ్యానికి బోలెడు లాభాలు చేకూరుతాయి అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version