సీఎం రేవంత్ రెడ్డి కలుస్తానని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రకటించారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేముంది అని అన్నారు. గతంలో ఇద్దరం టిడిపిలో కలిసి పని చేసిన వాళ్ళమని అన్నారు. చర్యకి తావు లేకుండా కలిసి ముందు మీడియా కి సమాచారాన్ని ఇస్తా అని చెప్పారు. తాము ఓడిపోతామని కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విషయంలో ఇంకా షాక్ లోనే ఉన్నామని అన్నారు. ఆ షాక్ నుండి నెమ్మదిగా ఒక్కొక్కరం తేరుకుంటామని అన్నారు. మల్కాజిగిరి ఎంపీగా నన్నే పోటీ చేయమన్నారు. కానీ నేను టికెట్ నా కొడుకు భద్రారెడ్డికి అడుగుతున్నానని చెప్పారు. టికెట్ ఎవరి కోసం ప్రచారం చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు సీఎంని కలుస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్యకు దారితీస్తుంది అని అన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తాజాగా ఇంకో ఎమ్మెల్యే మల్లారెడ్డి కలుస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.