అసెంబ్లీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు పక్క చూపులు చూడడం జరుగుతోంది. కొంతమంది గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరి కొంత మంది కూడా ఇదే బాట పడుతున్నారు. ఈ క్రమం లో పార్టీ మార్పు పై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక కామెంట్స్ చేశారు మంగళవారం తెలంగాణ భవన్ లో రిపోర్టర్ల తో ఆయన మాట్లాడారు నన్ను కూడా అన్ని పార్టీల వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు. కానీ నేను పోవాలి కదా అని అన్నారు.
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత పార్టీ మార్పు మీద మల్లారెడ్డి స్పందించారు. పార్టీ మారడం ఎంపీ వెంకటేష్ నేత ఇష్టమని ఎన్నికల ముందు డబ్బులు కోసమే ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కి వెళ్లారని అన్నారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాక ఆయనకి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేది లేదన్నారు అని అన్నారు