బ్యూటిఫుల్ భామ మాళవిక శర్మ.. సోషల్ మీడియా క్వీన్ అని నెటిజన్లు అంటుంటారు. ఈ సుందరి నెట్టింట చాలా టైం స్పెండ్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేస్తూ తన అప్ డేట్స్ ఇస్తుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటో ప్రజెంట్ నెట్టింట బాగా వైరలవుతోంది. కుర్రకారు మతి పోయేలా లుక్స్ ఇచ్చి.. తన హాట్ నెస్ తో వారిని చూపు తిప్పుకోనివ్వకుండా చేయడం మాళవిక స్పెషాలిటీ అని చెప్పొచ్చు.
మాస్ మహారాజ రవితేజ ‘నేల టికెట్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్..‘రెడ్’ సినిమాతో బాగా పాపులర్ అయింది. అప్పట్లో కొంచెం బొద్దుగా ఉన్న ఈ అమ్మడు కొంచెం లావు తగ్గినట్లు ఫొటో చూస్తుంటే అర్థమవుతోంది. యెల్లో విత్ బ్లూ కలర్ మిక్స్ డ్ స్లీవ్ లెస్ టాప్ ధరించిన మాళవిక శర్మ ఫొటో చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు.
వెరీ క్యూట్, బ్యూటిఫుల్ హీరోయిన్ నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే మాళవిక శర్మ కరోనా లాక్ డౌన్ టైంలో ఎల్ ఎల్ బీ కంప్లీట్ చేసింది. ప్రజెంట్ హైదరాబాద్ హై కోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తోంది. సరైన అవకాశం లభిస్తే మళ్లీ సినిమాల్లోకి వచ్చే చాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి.. మళ్లీ ఆమె సినిమాల్లోకి వస్తుందో..