మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. భూమా నాగిరెడ్డి కూతురు అయిన భూమా మౌనిక రెడ్డిని త్వరలో వివాహ మాడనుఎన్నడూ మంచు మనోజ్. ఇందులో భాగంగానే తాను త్వరలో వివాహమాడబోయే మౌనిక రెడ్డి తో కలసి ఇటీవల వినాయకుడిని దర్శించుకున్నాడు మనోజ్. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో…వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పైన, మంచు మనోజ్ రెండో వివాహం పైన ఇలా పలు విషయాలపై స్పందించారు. ఈ క్రమంలో “మనోజ్ ఇప్పుడు రెండో వివాహం చేసుకోబోతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటని సదరు యాంకర్ ప్రశ్నించగా, మంచు లక్ష్మి తనదైన శైలిలో స్పందించారు. పెళ్లి చేసుకుంటుంటే నేనేమంటానండి బాబు. ఎవడి దూ* వాడిది. ఎవరి బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి .ఈ రోజుల్లో ప్రపంచంలో ప్రేమని గుర్తించడం చాలా కష్టం. నిజాయితీ గల, నిజమైన ప్రేమని మనోజ్ పొందినందుకు సంతోషంగా ఉంది. నేను బ్లెస్ చేస్తున్నా. అంతే” అంటూ చెప్పుకొచ్చారు.