మనిషి మృతదేహంతో ఎరువు… పర్యావరణానికి మంచిదేనా..?

-

మనిషి చనిపోతే ఎందుకు పనికిరాడని అంటారు..ఒకటి రెండురోజులకంటే ఎక్కువ రోజులు కూడా ఉంచుకోరు..తెగిపోయిన చెప్పునైనా ఇంట్లోపెట్టుకుంటారు కానీ..ఇన్నాళ్లు మనతోనే ఉన్న మనిషి ప్రాణం పోతే మాత్రం ఎవరూ పెట్టుకోరు.. కొందరు దహనం చేస్తారు, మరికొందరు పూడ్చిపెడతారు. ఇంకొందరు మృతదేహాలను అలా జంతువులు, పక్షులకు ఆహారంగా వదిలేస్తారు. కానీ, అమెరికాకు చెందిన ఓ సంస్థ మాత్రం మృతదేహాల నుంచి ఎరువులు తయారుచేస్తోంది. వాషింగ్టన్, న్యూయార్క్ సహా అమెరికాలోని ఆరు రాష్ట్రాలు ఈ హ్యూమన్ కాంపోస్టింగ్‌కు అనుమతులున్నాయి. వ్యర్థాల నుంచి కాంపోస్టింగ్ గురించి మీరు వినే ఉంటారు. మరి హ్యూమన్ కాంపోస్టింగ్ అంటే ఏమిటి? ఎలా దీన్ని తయారుచేస్తారు? దీని వల్ల ప్రకృతికి మేలు జరుగుతుంది..?
అమెరికాలో ఈ హ్యూమన్ కాంపోస్టింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. మొదటగా 2019లో వాషింగ్టన్ స్టేట్ దీనికి ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఆరు రాష్ట్రాలు దీనికి అనుమతించాయి. ఈ ప్రక్రియలో భాగంగా మరణానంతరం మృతదేహాన్ని మట్టిలో కలిపేలా ఏర్పాట్లు చేస్తారు. దీని కోసం పర్యావరణహిత, సురక్షితమైన విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా ‘‘నేచురల్ ఆర్గానిక్ రిడక్షన్’’ పద్ధతిలో మృతదేహాలను కాంపోస్ట్‌గా చేస్తున్నారు.

 

ఎలా చేస్తారు..
మొదటగా మట్టి.. కర్ర ముక్కలు, పచ్చి గడ్డి, ఎండు గడ్డితో నింపిన డబ్బాలో మృతదేహాన్ని 30 రోజులపాటు ఉంచుతారు. సూక్ష్మజీవుల సాయంతో శరీరం విచ్ఛిన్నం అయ్యేలా జాగ్రత్తలు వహిస్తారు. నెల రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వేడిచేస్తారు. ఫలితంగా దీని నుంచి ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశం తగ్గుతుంది. చివరగా ఈ మట్టిని సదరు కుటుంబాలకు ఇస్తారు. పువ్వుల మొక్కలు, కూరగాయలు పెంచుకునేందుకు ఈ మట్టిని ఉపయోగించుకోవచ్చు.

పర్యావరణానికి మంచిదా?

సంప్రదాయ విధానాల్లో అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు విడుదలయ్యే కార్బన్‌ను హ్యామన్ కాంపోస్టింగ్‌తో చాలావరకు తగ్గించవచ్చని రీకంపోస్ చెబుతోంది. ప్రస్తుతం భూమి వేడెక్కడానికి కార్బన్ ఉద్గారాలు ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని..అందుకే హ్యూమన్ కాంపోస్టింగ్‌పై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారని రీకంపోస్ ఫౌండర్ కత్రినా స్పేడ్ బీబీసీతో చెప్పారు. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని ప్రోత్సహించడం వల్ల ఆదారణ బాగా పెరుగుతుంది..
సంప్రదాయ విధానాల్లో అంత్యక్రియల కోసం కర్రలు, మట్టి భారీగా అవసరం అవుతాయి. అదే హ్యూమన్ కాంపోస్టింగ్‌లో వీటి అవసరం కూడా తక్కువగా ఉంటుంది. ఇది పర్యావరణహిత విధానమని నిపుణులు కూడా చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో భూమి దొరక్క ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఇది మంచి పరిష్కారమని మరికొందరు అంటున్నారు.

ఖర్చు ఎంత?

హ్యూమన్ కంపోస్టింగ్ పర్యావరణహిత విధానం అయినప్పటికీ.. మరికొందరు దీనిపై ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తుతున్నారు. ఈ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు న్యూయార్క్‌లోని క్యాథలిక్ ప్రీస్ట్‌లు చెప్పారు. మానవ మృతదేహాలను వ్యర్థాల తరహాలో ప్రాసెస్ చేయకూడదని అంటున్నారు. మరికొందరు మాత్రం హ్యూమన్ కాంపోస్టింగ్‌కు ఎక్కువ ధర అవుతోందని అంటున్నారు. అయితే, పూడ్చడం లేదా దహనం చేయడానికి అయ్యే ఖర్చే ఈ విధానంలోనూ అవుతుందని రీకంపోస్ చెబోతోంది. స్వీడన్‌లోనూ ఈ విధానాన్ని అనుమతిస్తున్నారు. బ్రిటన్‌లో అయితే, శవపేటిక లేకుండా పూడ్చిపెట్టడం లేదా బయోడిగ్రేడబుల్ శవపేటికలతో పూడ్చి పెట్టడానికే అనుమతిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version