వరంగల్: మావోయిస్టులకు కరోనా ఎఫెక్ట్ తగిలింది. కరోనాతో మావోయిస్టు దండకారణ్య సబ్ కమిటీ నేత మధుకర్ మృతి చెందారు. చికిత్స కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆయన కన్నుమూశారు. మధుకర్‌పై 8 లక్షల రికార్డు ఉంది. ఈ నెల 2న వరంగల్ శివారులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మధుకర్ పట్టుబడ్డారు. మొదట వరంగల్ ఆసుపత్రిలో మధుకర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా తీవ్ర అస్వస్థతతో మధుకర్ మృతి చెందారు. దండకారణ్యంలో మరో 12మంది కీలక నేతలకు కరోనా సోకినట్టు పోలీసులకు మధుకర్ వెల్లడించారు.
కాగా కరోనా సోకిన మావోయిస్టులు చికిత్స చేయించుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. తమను కలిస్తే దగ్గరనుండి చికిత్స చేయిస్తామని తెలిపారు. కొందరు దండకారణ్యంలో చికిత్స పొందుతున్నారని, జనజీవన స్రవంతిలో వచ్చి మెరుగైన చికిత్స పొందాలని సూచించారు. చత్తీస్ గడ్ అడవుల్లో ఇప్పటికే 10 మంది మావోయిస్టులు మృతి చెందారు.