ఓటీటీలోకి వచ్చేస్తున్న మసూద.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

-

తెలుగు తెరపైకి గతంలో హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. అయితే కంటెంట్ ఉన్నవే థియేటర్లలో నిలబడ్డాయి .. వసూళ్లను రాబట్టాయి. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా ‘మసూద’ అని చెప్పుకోవచ్చు. అయితే.. సంగీత ప్రధాన పాత్రలో రీసెంట్‌గా వచ్చిన మూవీ మసూద. మళ్లీ రావా, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాలను అందించిన స్వధర్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. చాలా రోజుల తర్వాత వచ్చిన ఫుల్‌ లెంగ్త్‌ హారర్‌ మూవీ కావడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరించారు. నవంబర్‌ 18న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర హిట్‌గా నిలిచింది. థియేటర్‌లో ఈ సినిమాను మిస్సయిన ప్రేక్షకులు ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

Masooda OTT Release Date & Digital streaming Rights are Here

డిసెంబర్‌ 21 నుంచి తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మసూద సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్టు ఆహా ప్రకటించింది. ఈ మేరకు అఫిషియల్‌ ఓటీటీ రిలీజ్‌ పోస్టర్‌ను ట్వీట్‌ చేసింది. జార్జి రెడ్డి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్‌ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించాడు. కావ్య కళ్యాణ్‌, బాంధవి శ్రీధర్‌, శుభలేఖ సుధాకర్‌ ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాతో సాయికిరణ్‌ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news