మే 9 న ఏ రాశి వారికి మంచి లాభాలు ఉన్నాయంటే?

-

ఈరోజు చాలావరకూ అందరికి చికాకులు కనిపిస్తున్నాయి..అయితే ముందు జాగ్రత్తలు తెలుసుకోవడం చాలా మంచిది. ఈరోజు రాశి ఫలాలను చూద్దాం.

వృషభరాశి:

ఈ రోజు మొదలు కాగానే బ్రహ్మాండంగానూ, ముగింపు అధ్వాన్నంగానూ ఉంటుందని చెబుతున్నారు గణేశ్. మీ పనిలో మీరు చూపించే తెలివి వల్లనే మీకు ఆఫీసులో పోటీ అనేది లేకుండా ఉంటుంది. సామాజికంగానూ మీరు బాగా సెటిల్ అవుతారు. పనులు పూర్తి చేసుకునేందుకు ఎలాంటి ఉత్సాహపూరిత వైఖరి ప్రదర్శించేవారో, అది ఒక్కసారిగా మాయమైపోతుంది. మీకు నిరాశా, నిస్పృహలు మిగిలుస్తుంది. జాగ్రత్తగా మసలుకొవాల్సిన రోజు..

మిధున రాశి:

మీ ఆందోళన తారాస్థాయికి చేరుకుంటుంది. మీ ఖర్చులు కాస్త చూసి చేస్తూ ఉండండి. విద్యార్థులకు ఈ రోజు వల్లమాలిన శ్రమ కింద ఉంటుంది. ఈ రోజు విజయం సాధించడం బహు కష్టం. మధ్యాహ్నానికి పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త స్నేహితులతో బయటకు వెళ్లి సరదాగా తిరిగి రావచ్చు. డిన్నర్ కి ప్లాన్ చెయ్యవచ్చు. ఆర్థిక లబ్ధి సగం రోజు గడిచిన తరువాత కనిపిస్తోంది. స్త్రీ అదృష్టం మీ వెంట ఉంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు.

కర్కాటక రాశి:

ఈరోజు చాలా బాగా గడుస్తుంది.మానసిక , శారీరిక స్థితి అత్యుత్తమంగా ఉంటుంది. మీ ఉద్రేకాన్ని పెంచి పోషించి, మీ మనస్సు, శరీరం, ఉత్సాహం. . . వీటి మధ్యన ఉండే అనుబంధాన్ని దెబ్బ తీయవద్దు. ముఖ్యంగా మధ్యాహ్నం నించీ , మీ నిశ్చయాత్మక స్థితిని మీ నెగిటివ్ థింకింగ్ దెబ్బతీసే అవకాశం కనిపిస్తోంది.అందుకే జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ముఖ్యంగా మీరు ప్రేమించిన వారి ఎదుట మీ భాష సరిగా ఉండేలా చూసుకోండి. లేకపోతే వారికి కోపం వస్తుంది. అల్పమైన విషయాల్లోనూ, వివాదాల్లోనూ తలదూర్చడం మాని, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ ఉండండి. ఆరోగ్య సంరక్షణ అన్నిటికన్నా చాలా ముఖ్యం. మీరు ప్రశాంతంగా, గంభీరంగా ఉంటే మధ్యాహ్నం నించీ పరిస్థితి చక్కబడుతుంది. కొత్త ఐడియాలూ, ప్రాజెక్టుల మీద మీరు పని మొదలు పెట్టవచ్చు. పెండింగ్ పనులు పూర్తవడం అంత కష్టమేమీ కాదు..ఈరోజు మీకు అంత రోజు కాదని జ్యోతిష్య పండితులు అంటున్నారు.

కన్య:

ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో చర్చలకు అనుకూలం.శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు..

తుల:

ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది..ఉద్యొగాలలో ప్రశంసలు అందుకుంటారు..

వృశ్చికం:

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సోదరుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా సాగుతాయి..బంధువుల తో చికాకులు కలుగుతాయి.దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు:

కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు కలుగుతాయి. అనుకున్న వ్యవహారాలు సజావుగా సాగవు. మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వ్యాపారమున తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు.విలువైన వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి.

మకరం:

గృహమునకు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది..ఉద్యోగ , వాహనాల కొనుగొలు చేస్తారు.

కుంభం:

ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు ఆశించిన రీతిలో ఉంటాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు..సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు..

మీనం:

పాతరుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. మానసికంగా స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.ఉద్యొగాలలొ అనుకొని బాధలు, చింతన ఉంటుంది.. ఈ రోజు అంత మంచి రోజు కాదు..

Read more RELATED
Recommended to you

Exit mobile version