లిల్లీపూలకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది..సువాసన ఉండటంతో బొకేలు, తయారీలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. లిల్లీ పూల నుండి సుగంధ తైలాన్ని కూడా తీస్తారు.అలాగే సౌందర్య సాధనాలలో కూడా విరివిగా వాడతారు..విదేశాల్లో మంచి ధర పలుకుతుంది. ఒకసారి నాటితే మూడేళ్ల వరకు అదాయం పొందవచ్చు. ప్రత్యేకంగా చీడపీడల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం..
పెంకు పురుగులు ఆకులను తినడమే కాకుండా మొక్కల మొదళ్లలో, దుంపలకు రంధ్రాలు చేసి అవి కుళ్లిపోయేలా చేస్తాయి. ఈ పురుగుల ఉనికిని గమనిస్తే లీటరు నీటికి ౭ మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 2 మి.లీ, ఖీరిపైరిఫాస్‌తో పాటు అజాడిరక్టిన్ వేపమందు 5మి.లీ..మేర పిచికారి చేయాలి.
రసంపీల్ఫే పురుగులు.. ఆకులు, పూలకాడలు, పూమొగ్గలను. ఆశించి, గీకి, రసాన్ని పీల్చే తామర పురుగులు ఇటీవల లిల్లీకి ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి. ఈ తామర పురుగులు ఆశించిన భాగాలపైన గోధుమరంగు చారలు ఏర్పడి పూలు సైజు తగ్గి పోతుంది..పురుగుల నివారణకు లీటరు నీటికి 0.1 మిలీ. ఇమిడాళ్లోప్రీడ్ లేదా 0.8 గ్రా. ఆసిటామిప్రిడ్ లేదా 2 మి.లీ. పిస్రోనిల్ చొప్పున ఏదో ఒకదానిని కలిపి 15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 3సార్లు పిచికారీ చేయాలి..
పూమొగ్గలను తొలిచి, రంధ్రాలు చేసి లోపలి భాగాలను తినేసి పూలు అమ్మకానికి పనికి రాకుండా చేస్తాయి. ఈ పురుగుల నివారణకు ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రా. లేద్య పూబెండియమైడ్ 14 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.8 మి.లీ. చొప్పున లీట్రకు నీటికి కలిపి పిచికారి చెయ్యాలి..
నులిపురుగులు మొక్కల వేర్లపై రంధ్రాలు చేసి వేర్లలోనికి ప్రవేశిస్తాయి. మొక్కలు పాలిపోయి బలహీనంగా ఉంటాయి. మొక్కలను పీకి చూస్తే వేర్లపైన బుడిపెలు ఎక్కువగా ఉంటాయి, ఈ బుడిపెలు వల్ల మొక్కలకు పోషకాలు, నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి అకులు పసుపురంగుకు మారి మొక్కలు బలహీనపడి చనిపోతాయి..వెంటనే ఎకరాకు 10 కిలోల కార్చోప్యూరాన్ గుళికలు వెయ్యాలి..
ఎర్రనల్లి..ఆకుల్లో మొదట పసుపురంగు చారలుగా కనిపించి, క్రమేపి ఆ చారలు కాంస్యం రంగుకు మారి వడలి ఎండిపోతాయి. నివారణకు మొగ్గల ఆకుల అడుగుభాగం బాగా తడిచేలా ఒమైట్ 2 మి.లీ. లేదా ఒబెరాన్ 1 మి.లీ. లేదా ఇంట్రెప్రిడ్ 1.5 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి..పూల మొక్కలకు పురుగులు ఆశించడం సహజం..వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం మంచిది..లేకుంటే మాత్రం తీవ్ర నష్టాన్ని చవి చూదాల్సి వస్తుంది..ఏదైనా సందెహాలు ఉంటే మాత్రం వ్యవసాయ నిపునుల సలహా తీసుకోవడం మంచిది..