నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ ఏడాది విడుదల బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్టుగా నిలిచాయి. ముఖ్యంగా సుగుణసుందరి సాంగ్ యూట్యూబ్ లోనే పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఇందులో బాలయ్య, శృతిహాసన్ స్టెప్పులు కూడా అందరిని అలరించేలా ఉన్నాయి. ఇక ఎంతోమంది నెటిజెన్స్ ఈ పాటకు డ్యాన్సులు వేయడం కూడా జరిగింది.తమదైన స్టైల్ లో రీ క్రియేట్ చేసి మెప్పిస్తూనే ఉన్నారు.
తాజాగా మెగా కోడలు ప్రముఖ యాంకర్ మేఘన ఈ సూపర్ హిట్ సాంగ్ కు డాన్స్ వేయడం జరిగింది. మెగాస్టార్ ఫ్యామిలీకి దూరపు బంధువైన కొణిదెల పవన్ తేజ్ మేఘనను కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసింది. స్టార్ యాంకర్ గా పేరుపొందిన ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గానే ఉంటుంది. నిత్యం తన గ్లామర్ తో ఫ్యాషన్ తో పలు ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.
ఇంస్టాగ్రామ్ లో తాజాగా బాలయ్య వీరసింహారెడ్డి సుగుణసుందరి అంటూ పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. కొణిదెల పవన్ తేజు మాత్రం ఈ కథలో పాత్రలు కల్పితం అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఈ చిత్రంలో మేఘన హీరోయిన్గా నటించింది .ఆ తర్వాతే పవన్ తేజ్ చిరంజీవి ఆచార్య ,గాడ్ ఫాదర్ సినిమాలలో నటించారు. అటు మేఘన కూడా బుల్లితెర పైన స్టార్ యాంకర్ గా రాణిస్తోంది. మేఘన డాన్స్ కు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.