మెగాస్టార్ చిరు తండ్రి కూడా నటుడే.. ఇక ఆ సినిమాలు ఏమిటంటే..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మెగాస్టార్ ఎంత కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నాడో బహుశా చాలా మందికి తెలియదు అనే చెప్పాలి. నిజానికి నటించడం అంటే చాలా తేలిక అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని వేల మంది ప్రేక్షకుల ముందు సిగ్గు బిడియం లేకుండా చాలా చక్కగా నటించి మెప్పించారు అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇక ఈ కష్టం వెనుక ఎన్నో కటోర రాత్రులు కూడా దాగి ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి.. అయితే కొన్ని సార్లు రెండు మూడు సినిమాలు కూడా ఒకేసారి చేయాల్సి వస్తుంది. అలాంటి సమయాలలో తినడానికి సమయం కూడా దొరకదు. ఇక ఎన్నో కష్టాలను ఎదుర్కొని తమ సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి.అంతేకాదు ఇండస్ట్రీ లోకి రావాలనుకున్న ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికీ కూడా సినిమాలపై ఆసక్తితో వస్తున్న చాలామందికి చిరంజీవి ఒక రోల్ మోడల్ అని చెబుతూ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి తండ్రి ఒక కానిస్టేబుల్ అనే విషయం చాలా మందికి తెలుసు. కానీ ఆయన కూడా ఒక నటుడు అన్న విషయం మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అని చెప్పవచ్చు. ఇక మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాపు దర్శకత్వంలో మంత్రిగారి వియ్యంకుడు అనే సినిమా వచ్చింది.

ఇక ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రను ఎవరితో వేయిస్తే బాగుంటుంది అనే సందేహంలో దర్శకుడు ఉన్నప్పుడు.. ఆ సమయంలో చిరంజీవి మామయ్య అల్లు రామలింగయ్య మా బావ గారు ఉన్నారు కదా ఆయనతో వేయిద్దాం అంటూ సలహా ఇచ్చారట. అలా మంత్రి గారి వియ్యంకుడు సినిమా లో మెగాస్టార్ తండ్రి వెంకట రావు మంత్రి గా నటించారు. ఇక 1969లో వచ్చిన జగత్ జెట్టీలు అనే సినిమాలో కూడా ఆయన నటించారు. ఇక సినిమాలపై మక్కువ ఉన్నప్పటికీ కుటుంబ పోషణ కోసం తన ఇష్టాన్ని త్యాగం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version