వివాదంలో మంత్రి అప్పలరాజు , జగన్ కు మరో తలనొప్పి కానుందా ?

-

2024 లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు చాలా ప్రతిష్టాత్మకం అయిన సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతకైనా తెగించడానికి రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఎప్పటిలాగే ఈ ఎన్నికలలోనూ అంతిమ పోరు వైసీపీ మరియు టీడీపీ ల మధ్యనే ఉండనుంది. ఇదిలా ఉంటే, తాజాగా శ్రీకాకుళం జిల్లా మంత్రిగా ఉన్న సీదిరి అప్పలరాజు చేసిన సంచలన వ్యాఖ్యలు వైసీపీకి మరియు ప్రభుత్వానికి ఇబ్బంది కొనితెచ్చేలా ఉన్నాయి. ఈయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ … మన ఓట్లు అయితే ఓకే .. కానీ మనకు పడవు అనుకుంటే మాత్రమే ఆ ఓటర్ల ఫై ఫార్మ్ 7 లో ఫిర్యాదు చేయండి అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ వ్యాఖ్యల సారాంశం వైసీపీ ఓటర్లు అయితే ఉంచండి, టీడీపీ లేదా ఇతర పార్టీల ఓటర్లు అయితే అభ్యంతరం చేయండి అంటూ చెప్పారు.

ఈ విషయం మళ్ళీ సీఎం జగన్ కు తలనొప్పిరాగా మారుతుందా అంటే తెలియాల్సి ఉంది. ఇది ఏమైనా మార్ఫెడ్ వీడియో నా లేదా వాస్తవం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం మంత్రిపై చర్యలు తీసుకోవాలని జనసేన మరియు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version