సిద్ధిపేట ఒక విద్యాక్షేత్రంగా విరాజిల్లుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం ఆయన సిద్ధిపేట కేంద్రీయ విద్యాలయం వార్షిక వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్ధిపేటకు కేంద్రీయ విద్యాలయం అనేది నా పదేళ్ల ప్రయత్నమని, అది 2018లో ఫలించిందని ఆయన వెల్లడించారు. రూ.24 కోట్ల రూపాయల వ్యయంతో ఏన్సాన్‌పల్లిలో కేంద్రీయ విద్యాలయం కోసం నూతన భవన నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు.
పాలిటెక్నిక్ కళాశాలలు, 1 ప్రభుత్వ ఐటీఐ కళాశాల, 1 పీజీ కళాశాల, 1 మహిళా డిగ్రీ కళాశాల, 2 ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్ కళాశాలలు, 2 ప్రభుత్వ, ప్రయివేటు నర్సింగ్ కళాశాలలు సిద్ధిపేటలో నెలకొల్పుకున్నామన్నారు. త్వరలోనే బీవీఎస్సీ- బ్యాచ్ లర్ ఆఫ్ వెటరర్నీ సైన్సెన్ తెచ్చుకోబోతున్నాం. అలాగే త్వరలో వరల్డ్ క్లాస్ ప్రయివేటు యూనివర్సిటీ రానున్నది. ఈ క్రమంలో సిద్ధిపేట ఆల్ రౌండ్ ఎడ్యుకేషన్ హబ్ గా ఎదగనున్నదని ఆయన పేర్కొన్నారు.