కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం మన అదృష్టం : హరీష్‌ రావు

-

మర్కుక్ మండలం పాములపర్తి గ్రామం కేసీఆర్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కావేరి భాస్కర్ రావు చారిటబుల్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అయన ప్రారంభించి లబ్ధిదారులతో మంత్రి హరీష్ రావు గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒక చెమట చుక్క కూడా రాల్చకుండా, ఒక పైసా ఖర్చు పెట్టకుండా హైదరాబాద్ జూబ్లీహిల్స్ స్థాయిలో కావేరి సీడ్స్ చారిటబుల్ సౌజన్యంతో నిర్మించిన ఇళ్లను పొందిన లబ్ధిదారులు చాలా అదృష్టవంతులన్నారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం మన అదృష్టం అన్నారు ఆయన.

Harish Rao lashes at Chandrababu Naidu on rice claim - Telangana Today

సిద్దిపేటపై మంత్రి హరీశ్ రావు ప్రశంసలు కురిపించారు. ‘సిద్దిపేట అంటేనే స్వచ్ఛత.. స్వచ్చత అంటేనే సిద్దిపేట’ అన్న మంత్రి.. స్వచ్ఛతలో, హరితహారంలో సిద్దిపేటకు 22 అవార్థులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘స్వచ్ఛ పూదోట మన సిద్దిపేట. సిద్దిపేట పేరు లేకుండా కేంద్రం నుంచి గాని, రాష్ట్రం నుంచి కానీ అవార్డులు ఉండవు. ఒక్క పార్కు లేని మన సిద్దిపేటలో ఎన్నో పార్కులు అభివృద్ధి చేసుకున్నాం. కోమటి చెరువు కోటి అందాలతో వెలుగొందుతోంది. దేశంలో ఎక్కడా లేని విదంగా రైతు మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, వైకుంఠ దామాలు ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాదు.. విద్యానిలయంగా మార్చుకున్నాం. ఆరోగ్య నిలయంగా మార్చుకోబోతున్నాం. 6 నెలల తరువాత రంగనాయకసాగర్ చూస్తే దేశం ఆశ్చర్యపోతుంది. దేశ పటంలో సిద్దిపేట స్థానాన్ని నిలపబోతున్నాం..” అంటూ మంత్రి ప్రశంసలు కురిపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news