ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సచివాలయ వార్డ్ వాలంటీర్ వ్యవస్థ వలన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అందరూ ప్రత్యక్షముగా అనుభవిస్తున్నారు. ఈ వాలంటీర్లు ప్రతి ఒక్క సంక్షేమ పధకాన్ని ఇంటింటికీ అందేలా కష్టపడుతూ తక్కువ జీతం అయినా సర్దుకుని ప్రజలకు సేవ చేస్తున్నామనే తృప్తితో బ్రతుకుతున్నారు. అయితే ఇటీవల వీరి గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని, ప్రజలను మరియు వాలంటీర్లను చాలా బాధకు గురి చేశాయి. తాజాగా ఈ విషయంపై మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. ఈ రాష్ట్రంలో వాలంటీర్ ల వలన సచివాలయ సంస్థలు సక్సెస్ కావడాన్ని పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని అన్నారు పవన్. తెలంగాణాలో నివసిస్తున్న పవన్ కు వీటి గురించి ఎలా తెలుస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో నిజంగా పవన్ లో ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే పొత్తులు లేకుండా బరిలోకి రావాలని ఛాలెంజ్ చేశారు మంత్రి జోగి రమేష్.
పవన్ పై వాలంటీర్ ను పోటీకి నిలుపుతాం గెలిచే సత్తా ఉందా : మంత్రి జోగి రమేష్
-