పవన్‌కు శ్రార్ధానికి – తద్దినానికి, పెళ్ళికి – పేరంటానికి తేడా తెలియదు : మంత్రి కారుమూరి

-

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. చంద్రబాబు స్క్రిప్టులను చదివే పవన్ గురించి తాను మాట్లాడనని హేళన చేశారు ఆయన. శ్రార్ధానికి – తద్దినానికి, పెళ్ళికి – పేరంటానికి తేడా తెలియని వ్యక్తి పవన్ అని అన్నారు ఆయన. పవన్ చేసిన వ్యాఖ్యలతో వాలంటీర్ల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టే ఆయనపై కేసులు వేస్తున్నారని వెల్లడించారు మంత్రి. ఈ కాలంలో మనం చాలాచోట్ల మన వివరాలను ఇస్తున్నామని.. పవన్ ముందుకు వెళ్తున్నాడా? వెనక్కి వెళ్తున్నాడా? అర్థం కావడం లేదని మండిపడ్డారు కారుమూరి.

జగన్, కారుమూరి వివరాలు కావాలన్నా.. చిన్న క్లిక్‌తో వస్తాయన్నారు. గజదొంగలు అనే పదం టీడీపీ నేతలకే వర్తిస్తుందని హేళన చేశారు ఆయన. ఆలీబాబా చంద్రబాబు, నలభై దొంగల లోకేష్‌తో కలిపి.. వాళ్ళే గాదె కింద పందికొక్కుల్లా తిన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లటమే మీ పనా? అని ప్రశ్నించారు. చంద్రబాబు సమావేశాలు పెడితే ఏమీ జరిగేది కాదని.. కానీ జగన్ సమావేశం పెడితే ఒక సంక్షేమం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు ధనికులు ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువయ్యారన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version